కార్తీ కెరియర్లో ఫస్టు టైమ్ .. 100 కోట్లను కొల్లగొట్టేసిన 'ఖైదీ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్తీ కెరియర్లో ఫస్టు టైమ్ .. 100 కోట్లను కొల్లగొట్టేసిన 'ఖైదీ'

  • క్రితం నెల 25న వచ్చిన విజయ్ 'విజిల్'
  • కంటెంట్ పై నమ్మకంతో పోటీకి దిగిన కార్తీ 
  • కార్తీ నమ్మకాన్ని నిలబెట్టిన కంటెంట్
తమిళ హీరోల్లో రజనీ .. అజిత్ .. విజయ్ సినిమాల టాక్ ఎలా వున్నా అవలీలగా ఆ సినిమాలు 100 కోట్ల మార్కును టచ్ చేస్తుంటాయి. ఇక మిగతా హీరోలకి మాత్రం ఆ మార్కును చేరుకోవడం కొంత కష్ట సాధ్యమే అవుతుంటుంది. అలాంటి కష్టసాధ్యమైన 100 కోట్ల మార్క్ ను 'ఖైదీ' చిత్రంతో కార్తీ చేరుకున్నాడు. కార్తీ తన కెరియర్లో ఇంతవరకూ కొన్ని హిట్ సినిమాలు చేసినా, అవేవి 100 కోట్ల క్లబ్ లోకి చేరుకోలేదు.

100 కోట్ల క్లబ్ లో తన సినిమాను చూసుకోవాలనే కార్తీ కలను 'ఖైదీ' నిజం చేసింది. కెరియర్లో తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్ చూసినందుకు కార్తీ సంతోషంతో పొంగిపోతున్నాడు. విజయ్ 'విజిల్' సినిమా పోటీని తట్టుకుని కార్తీ 'ఖైదీ' ఈ స్థాయి వసూళ్లను సాధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. కంటెంట్ పై నమ్మకంతో బరిలోకి దిగిన కార్తీని ఆ కంటెంటే కాపాడిందని అంటున్నారు.
karthi
Vijay

More Telugu News