జగన్ చేస్తున్న మంచి పనులు పవన్ నాయుడికి కనిపించడం లేదు: పేర్ని నాని వ్యంగ్యం
- పవన్ నాయుడు అంటూ జనసేనానిపై ధ్వజమెత్తిన నాని
- పవన్ కు ఇసుక తప్ప మరేమీ కనిపించడంలేదని విమర్శలు
- చంద్రబాబు చెప్పిన మాటలతోనే రోడ్లపైకి వస్తున్నారంటూ ఆరోపణ
ఇసుక కొరత, ఇంగ్లీషు మీడియం వ్యవహారాలపై జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి పేర్ని నాని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ నాయుడు అంటూ సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు పవన్ నాయుడికి కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ ఎన్నికల హామీలను అమలు చేస్తుంటే, పవన్ నాయుడికి ఇసుక తప్ప మరేమీ కనిపించడం లేదని అన్నారు.
చంద్రబాబు చెప్పిన మాటలతోనే పవన్ నాయుడు రోడ్లపైకి వస్తున్నారని ఆరోపించారు. దున్నపోతు ఈనిందని చంద్రబాబు అంటే, దూడను కట్టేస్తానంటూ పవన్ వస్తున్నారని ఎత్తిపొడిచారు. పవన్ నాయుడు అని ఎందుకు అంటున్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని తెలిపారు. పవన్ కు నరనరాన కులతత్వం జీర్ణించుకుపోయిందని, ఎవరో సినిమా రైటర్ రాసిస్తే విమర్శలు చేయడం సరికాదన్నారు. 'పవన్ నాయుడు గారూ, మీరు ఒక్కసారి తాట తీస్తే మీ ఎదుటివాళ్లు పదిసార్లు మీ తాట తీస్తారని' హెచ్చరించారు.