పవన్ కు పెళ్లిళ్లపై మక్కువ ఉంటే, జగన్ కు ప్రజాసేవపై మక్కువ ఉంది: పేర్ని నాని వ్యాఖ్యలు
- పెళ్లయినా, ప్రజాసేవ అయినా మనసుకు నచ్చినట్టు చేస్తారన్న మంత్రి
- పవన్ పై జగన్ వ్యక్తిగత విమర్శలు చేయలేదంటూ సమర్థన
- అందరూ కోరితేనే ఇంగ్లీషు మీడియం తెస్తున్నామని వెల్లడి
సీఎం జగన్ ఎప్పుడూ పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదని, వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలను పవన్ గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ ను ఎంతోమంది యువత కోరారని, పాదయాత్ర సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు జగన్ కు సూచనలు చేశారని పేర్ని నాని వెల్లడించారు. అందరి కోరిక మేరకే ఇంగ్లీషు మీడియం తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు.