రేపు మరో కీలక తీర్పును వెలువరించనున్న సుప్రీంకోర్టు
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను స.హ. చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న కేసులో తీర్పు
- సుప్రీంకోర్టు, సీజేఐ కార్యాలయం స.హ. చట్టం పరిధిలోకి వస్తాయంటూ ఢిల్లీ హైకోర్టు తీర్పు
- ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4వ తేదీన పిటిషన్ ను రిజర్వ్ లో పెట్టింది. రేపు మధ్యాహ్నం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తుది తీర్పును వెలువరించనుంది.