Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లంచాలు, మోసాలకు తావులేకుండా ఉద్యోగాలు.... ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించిన సీఎం జగన్

  • ఆప్కాస్ వెబ్ సైట్ ప్రారంభించిన సీఎం
  • మధ్యవర్తులు లేకుండా ఉద్యోగాలు
  • ఎన్నికల హామీ నిలబెట్టుకున్నామని వెల్లడి
సీఎం వైఎస్ జగన్ ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. ఎన్నికల హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్ కు సంబంధించి వెబ్ సైట్ (ఏపీ ఆప్కాస్) ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధ్యవర్తులు లేకుండా, మోసాలకు, లంచాలకు తావులేని విధంగా నిరుద్యోగులకు మేలు జరిగేందుకే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇక నుంచి ఈ కార్పొరేషన్ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయిస్తామని, జిల్లాస్థాయిలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇచ్చేలా నిర్ణయించామని వివరించారు.
Jagan
Andhra Pradesh
YSRCP

More Telugu News