టీటీడీ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే... పాలకమండలి సంచలన నిర్ణయం!
- జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ రిజర్వేషన్లు
- భూమన ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం
- హర్షం వెలిబుచ్చుతున్న చిత్తూరు యువత
ఇక జగన్ ప్రభుత్వం సైతం ఈ తీర్మానానికి ఆమోదం పలికితే, ఇకపై వెలువడే ఉద్యోగాల నోటిఫికేషన్ లలో చిత్తూరు జిల్లా యువతీ యువకులకు ప్రాతినిధ్యం పెరగనుంది. టీటీడీ తాజా నిర్ణయాన్ని స్వాగతిస్తూ, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.