వెంటిలేటర్ పై లతామంగేష్కర్.. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
- న్యూమోనియాతో బాధ పడుతున్న లత
- పని చేయని ఎడమ జఠరిక
- కొన్ని గంటలుగా పరిస్థితి కొంత మెరుగైందన్న వైద్యులు
లత వయస్సును (90 ఏళ్లు) దృష్టిలో ఉంచుకుని తాము ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని డాక్టర్ ప్రతీత్ తెలిపారు. హై డోస్ యాంటీబయోటిక్స్ ఇస్తున్నామని చెప్పారు. నిన్న తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెయ్యికి పైగా హిందీ చిత్రాల్లో వేలాది పాటలను పాడిన లతా మంగేష్కర్ ను 2001లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది.