నాకు అన్నీ మా నాన్నే .. నా బర్త్ డే రోజునే ఆయన పోయారు: సీనియర్ హీరోయిన్ రాశి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు అన్నీ మా నాన్నే .. నా బర్త్ డే రోజునే ఆయన పోయారు: సీనియర్ హీరోయిన్ రాశి

  • మా నాన్నంటే నాకు చాలా ఇష్టం 
  • నేను హీరోయిన్ కావాలనేది ఆయన కోరికే
  • అందుకే బర్త్ డే జరుపుకోనన్న రాశి
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాశి మాట్లాడుతూ, తన జీవితంలో తనకి ఎదురైన ఒక విషాద సంఘటనను గురించి ప్రస్తావించారు. "నేను సినిమాల్లోకి వెళ్లాలనేది నాన్న పట్టుదలే. ఆయన కారణంగానే నేను అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. నా సంతోషం .. బాధ అన్నీ కూడా మా నాన్నతోనే షేర్ చేసుకునే దానిని. షూటింగ్ నిమిత్తం నేను ఎక్కడ వున్నా, ఆయన కాల్ చేసేవారు.

ఆ రోజున నేను ఊటీలో వున్నాను .. విజయకాంత్ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఆ రోజున నా పుట్టినరోజు కావడంతో, యూనిట్ సభ్యులు కేక్ కటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందురోజు రాత్రి నాన్న కాల్ చేయలేదు .. ఆ విషయాన్ని గురించే ఆలోచిస్తున్నాను. మనసు ఏదో కీడు శంకిస్తోంది. అంతలో మా అన్నయ్యకి కాల్ వచ్చింది. ఆయన కాల్ మాట్లాడేసి .. 'నాన్న చనిపోయారట' అన్నాడు. అంతే.. ఆ షాక్ నుంచి నేను తేరుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ నేను బర్త్ డే జరుపుకో లేదు" అని చెప్పుకొచ్చారు.
Rasi
Ali

More Telugu News