Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ పిల్లలు తెలుగు మీడియంలో చదివారా.. జగన్ గారూ?: నారా లోకేశ్ కౌంటర్

  • 'ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు' అని గతంలో అన్నారు
  • 'ఎందుకింత తెగులు?', 'తెలుగు లెస్సేనా?' అంటూ ఉద్యమం చేశారు
  • మరి అప్పుడు మీ బుద్ధి ఏమయ్యింది?
తెలుగు మీడియం ఉండాలని మాట్లాడుతున్న నేతల పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన టీడీపీ నేత నారా లోకేశ్.. కౌంటర్ ఇచ్చారు. 'ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు' అని ఉద్యమం చేసినప్పుడు సీఎం జగన్ పిల్లలు తెలుగు మీడియంలోనే చదివారా? అని నిలదీశారు.

'అయ్యా గజిని జగన్ గారు.. మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేశారు గుర్తు లేదా? నగర పాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ రోజు మీరు అడ్డుపడ్డారు' అని ట్వీట్ చేశారు.
 
''ఎందుకింత తెగులు?', 'తెలుగు లెస్సేనా?' అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది? జగన్ గారూ! 'ఇంగ్లిష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు' అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా?' అని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 
telugu
jaga
Nara Lokesh
Telugudesam

More Telugu News