మేఘాల్లో మంచు పుట్టుక గుట్టును ఛేదించిన శాస్త్రవేత్తలు
- నిట్ట నిలువు గాలులే మంచు పుట్టుకకు కారణం
- మిశ్రమ దశ మేఘాలు ఎంత ఎక్కువగా కుదుపునకు గురైతే అంత ఎక్కువ మంచు
- జర్మనీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
సాంద్రత తక్కువగా ఉండే వేడిగాలి పైకి వెళ్లే క్రమంలో ఈ మిశ్రమ దశ మేఘాలు కుదుపులకు గురవుతాయి. ఈ క్రమంలో మంచుకణాలు కలిసిపోయి మంచు తయారవుతున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. మంచు తయారీకి నిట్టనిలువుగా కుదిపేసే గాలులే కారణమని స్పష్టం చేశారు. ఈ గాలులు ఎంత ఎక్కువగా కుదిపేస్తే అంత ఎక్కువ మొత్తంలో మంచు తయారవుతుందని, లేజర్, రాడార్ టెక్నాలజీతో ఈ అధ్యయనం నిర్వహించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.