ఐటమ్ గాళ్ కు ఓట్లేయాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న క్రికెటర్ హార్దిక్ పాండ్య
- నటాషా స్టాంకోవిచ్ తో పాండ్య చెట్టాపట్టాల్
- నాచ్ బలియే డ్యాన్స్ షోలో పోటీపడుతున్న నటాషా
- బాలీవుడ్ లో ఐటమ్ గాళ్ గా గుర్తింపు తెచ్చుకున్న సెర్బియా అమ్మాయి
నటాషాతో హార్దిక్ పాండ్య కొన్నిరోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. కెమెరా కళ్లకు కూడా వీరిద్దరూ జంటగా చిక్కడంతో ఊహాగానాలకు బలం చేకూరుతోంది. హార్దిక్ ఈ వేసవిలో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు పరిచయం చేసినట్టు తెలుస్తోంది.