అయోధ్య తీర్పు నేపథ్యంలో భారత్ లో దాడులకు ఉగ్రవాదుల ప్రణాళిక.. అప్రమత్తమైన భద్రతా దళాలు
- ఉగ్ర ముప్పుపై కేంద్రానికి వివరాలు తెలిపిన నిఘా వర్గాలు
- దాడులను నిరోధించేందుకు చర్యలు
- ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో దాడులు జరిగే అవకాశం
దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్ర వాదుల ప్రతిపాదిత లక్ష్యాలను ముందుగానే పసిగట్టి ఈ దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉగ్రవాదులు దాడులు జరపవచ్చని నిఘా సంస్థలు చెప్పాయి.