మైదానంలో తన ఆవేశంపై వివరణ ఇచ్చిన రోహిత్ శర్మ
- బంగ్లాదేశ్ తో రెండో టి20లో రోహిత్ ఆగ్రహం
- థర్డ్ అంపైర్ పై తిట్లపురాణం
- టెలివిజన్ స్క్రీన్ పై కనిపించిన రోహిత్ కోపతాపాలు
అయితే రోహిత్ కోపతాపాలు టెలివిజన్ స్క్రీన్ పై స్పష్టంగా కనిపించడమే కాదు, తిట్లపురాణం కూడా స్టంప్ మైక్ ద్వారా వినిపించింది. దీనిపై రోహిత్ మీడియాతో మాట్లాడుతూ, తానెప్పుడూ మైదానంలో భావోద్వేగాలతో ఉంటానని తెలిపాడు. ఎలాగైనా మ్యాచ్ గెలవాలన్న సమయాల్లో భావోద్వేగాలకు లోనవడం సహజమేనని వెల్లడించాడు. అయితే ఈసారి కోపం వచ్చినప్పుడు కెమెరా ఎక్కడుందో చూసుకుని జాగ్రత్త పడతానని చమత్కరించాడు. తొలి మ్యాచ్ లో ఓటమి కారణంగా రెండో మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోలేకపోయామని, అందుకే కొంత తీవ్రత తనలో కనిపించి ఉండొచ్చని అన్నాడు.
మూడు టి20 మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. నాగ్ పూర్ వేదికగా రేపు మూడో టి20 మ్యాచ్ జరగనుంది.