ఏదో ఓ సమయంలో భారత్ లో పర్యటిస్తా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- భారత్ తో మెరుగైన సంబంధాలను కొనసాగిస్తున్నాం
- ఇరు దేశాల మధ్య చాలా అంశాలపై చర్చలు జరుగుతున్నాయి
- మోదీ నాకు మంచి మిత్రుడు
కాగా, ఇటీవల హ్యూస్టన్ లో నిర్వహించిన 'హౌడీ-మోదీ' కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ ని కుటుంబసమేతంగా భారత పర్యటనకు రావాలని మోదీ ఆహ్వానించారు. ఇటీవల భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచడంతో భారత్ కూడా ఆ దేశ వస్తువులపై సుంకాలు పెంచింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య విభేదాలు తలెత్తాయి. వీటిని తొలగించుకునేందుకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.