ఎలుకల కారణంగా.. కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయిన యువతి!

  • అగరంలోని గుడుపల్లె గ్రామంలో ఘటన
  • కరెంటు స్తంభానికి స్విచ్‌ 
  • అందులోని తీగలను కొరికేసిన ఎలుకలు
  • ఉతికిన దుస్తులు ఆరేస్తూ యువతి మృతి
ఎలుకల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. అగరంలోని గుడుపల్లె గ్రామంలో కరెంటు స్తంభానికి ఓ స్విచ్‌ అమర్చి ఉంది. ఆ బాక్సులోకి ఎలుకలు దూరి, తీగలను కొరికేశాయి. దీంతో ఆ స్తంభానికి విద్యుత్ సరఫరా అయింది. ఈ విషయాన్ని గుర్తించని సరోజ (19) ఉతికిన దుస్తులను అక్కడి కమ్మీపై ఆరవేయాలని చూసింది. అదే సమయంలో స్తంభం నుంచి కమ్మీలోకి కరెంటు సరఫరా కావడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు సరోజను, ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. కరెంటు స్తంభంలోకి విద్యుత్ ఎలా ప్రవహించిందన్న విషయాన్ని పరిశీలించగా స్విచ్ లో చేరిన ఎలుకలే.. తీగలను కొరికేశాయని తేలింది. 
Go Back to Shorts
Chittoor District
rats

More Telugu News