Vijay Sai Reddy: దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
పాఠశాల విద్య మొత్తాన్ని ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వస్తోన్న విమర్శల పట్ల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లపై విమర్శలు గుప్పించారు.

'మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు తండ్రీ కొడుకులు. దేవాన్ష్ ను తెలుగు మీడియంలో చదివిస్తామని చెప్పండి చూద్దాం?' అని విజయసాయి రెడ్డి సవాలు విసిరారు.

 అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ... 'పది వేల రూపాయల లోపు డిపాజిట్ చేసి మోస పోయిన 3.7 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ నిధులు పంపిణీ చేసి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలుపుకున్నారు. మీకిది కనిపించట్లేదా చంద్రబాబు గారూ. కుక్కలను ఉసిగొల్పి మొరిగించే బదులు ఇలాంటి మంచి పనులను ప్రశంసిస్తే హుందాగా ఉంటుంది' అని ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News