Jagan: సరిగ్గా రెండేళ్లయింది.. వైఎస్ జగన్ పాదయాత్ర స్మృతులను పంచుకున్న విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో రెండేళ్లని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వెల్లడించారు. నాటి స్మృతులను అందరితో పంచుకున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో జగన్ 2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి చారిత్రాత్మక రీతిలో పాదయాత్ర ప్రారంభించారని విజయసాయి గుర్తుచేసుకున్నారు. శ్రీకాకుళం వరకు సాగిన ఈ పాదయాత్రలో జగన్ మొత్తం 3,648 కిలోమీటర్లు చుట్టేశారని వివరించారు.

పాదయాత్రలో వినిపించిన ప్రతి గొంతుక, వైసీపీని ప్రజల పక్షంగా తీర్చిదిద్దడంలో, పార్టీ అజెండా రూపకల్పనలో సాయపడిందని భావిస్తున్నామని తెలిపారు. పాదయాత్ర తొలిరోజున ఇచ్చిన హామీ మొదలు ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Jagan
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News