Vishal: విశాల్ 'యాక్షన్' నుంచి తమన్నా సాంగ్

షార్ట్స్‌లో చూడండి
విశాల్ కథానాయకుడిగా తమిళంలో 'యాక్షన్' సినిమా నిర్మితమైంది. సుందర్ సి. దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తమిళంతో పాటు తెలుగులోను ఈ నెల 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు వెర్షన్ నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును రిలీజ్ చేశారు.

కథానాయకుడిని ఆరాధిస్తూ .. ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయన పట్ల తనకి గల ప్రేమను కథానాయిక ఆవిష్కరించే పాట ఇది. 'ఎటు నడుస్తున్నా .. యాడ నిలుస్తున్నా .. అన్నీ మరుస్తున్నా .. నిన్ను తలుస్తున్నా.." అంటూ ఈ పాట సాగుతోంది. హిపాప్ తమిజా సంగీతం .. 'మనసి' ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. 'మది కారాగారంలో ఖైదు చేస్తున్నా .. నీ నీడ దొరకదని ఎండ దుప్పటి నేను పరచుకున్నా .. నీ ప్రేమ దొరకదని నేస్తమల్లె నను నేను మార్చుకున్నా' అంటూ చంద్రబోస్ చేసిన పదాల గారడితో పాట అందంగా .. అనుభూతిని తోడు చేసుకుని సాగింది.
Go Back to Shorts
Vishal
Tamanah

More Telugu News