బోధన భాషగా ఆంగ్లంతో పాటు, తెలుగుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
- విద్యాశాఖ నిర్ణయంతో మాతృభాష తెలుగుకు అవమానం
- దేశంలో హిందీ తర్వాత తెలుగే ఎక్కువమంది మాట్లాడతారు
- రాష్ట్రంలో ఇప్పటికే 8,500 స్కూళ్లలో ఇంగ్లీష్ బోధన భాషగా ఉంది
ఇంగ్గీష్ తో పాటు తెలుగుకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ లో మాతృభాషను కించపరిచినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 43,200 పాఠశాలలు ఉండగా, 8,500 పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం బోధన భాషగా కొనసాగుతోందన్నారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాషే అని సీపీఐ నేత చెప్పారు.