ఊపిరి పీల్చుకుంటున్న హస్తిన... తగ్గిన వాయు కాలుష్యం!
- కాస్తంత మెరుగుపడిన ఎయిర్ క్వాలిటీ
- ఏక్యూఐ 356 పాయింట్లుగా నమోదు
- గణాంకాలు వెల్లడించిన అధికారులు
అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏక్యూఐ ఇండెక్స్ ఇంకా 'వెరీ పూర్' కేటగిరీలోనే కొనసాగుతోంది. ముఖ్యంగా చాందినీ చౌక్ ప్రాంతంలో ఏక్యూఐ 468గా ఉంది. నోయిడాలో 412గా, గురుగ్రామ్ లో 389గా నమోదైంది. ఈ గణాంకాలు ప్రమాదకర స్థాయినే సూచిస్తున్నా, దీపావళి తరువాతి రోజుతో పోలిస్తే, ఎయిర్ క్వాలిటీ కాస్తంత మెరుగు పడినట్టేనని భావించవచ్చని అధికారులు వ్యాఖ్యానించారు.