కాక్ పిట్ లోకి అమ్మాయిని పిలిచి ఫొటో తీసిన పైలెట్... ఉద్యోగం పీకేసిన ఎయిర్ లైన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాక్ పిట్ లోకి అమ్మాయిని పిలిచి ఫొటో తీసిన పైలెట్... ఉద్యోగం పీకేసిన ఎయిర్ లైన్స్!

  • చైనాలో ఘటన
  • జీటీ 1011 కాక్ పిట్ లో అమ్మాయి
  • సహకరించిన సిబ్బందిపైనా చర్యలు
ప్రయాణికురాలిగా ఓ విమానం ఎక్కిన అమ్మాయిని కాక్ పిట్ లోకి తీసుకెళ్లడంతో పాటు, అక్కడ అమెను ఫొటో తీసిన ఓ పైలట్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. చైనాలోని గుయిలిన్ నుంచి యాంగ్జోకు బయలుదేరిన జీటీ 1011 సర్వీసులో ఈ ఘటన చోటు చేసుకుంది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, విమానం నడిపే పైలట్, ప్రయాణికురాలిని కాక్ పిట్ లోకి ఆహ్వానించాడు. ఆపై అక్కడామెను కూర్చోబెట్టి చిత్రాలు తీశాడు. తన చేతి వేళ్లను 'వీ' ఆకారంలో పెట్టి ఫొటోలు దిగిన ఆమె, తనకెంతో సంతోషంగా ఉందని, కెప్టెన్ కు ధన్యవాదాలని చెబుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది.

ఇవి వైరల్ కావడంతో ఎయిర్ లైన్స్ యాజమాన్యానికి విషయం తెలిసింది. ఎయిర్ లైన్స్ నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రయాణికులను కాక్ పిట్ లోకి అనుమతించడంతో పాటు ఆమె చిత్రాలు తీయడం నేరమేనని చెబుతూ, అతన్ని విధుల నుంచి బహిష్కరించారు. ఆమెను లోపలికి పంపేందుకు సహకరించిన విమాన సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 
China
Flight
GT 1011
Pilot

More Telugu News