'పెంగ్విన్' షూటింగును పూర్తిచేసిన కీర్తి సురేశ్
- విభిన్నమైన కథాంశంతో 'పెంగ్విన్'
- నిర్మాతగా మారిన కార్తీక్ సుబ్బరాజ్
- గర్భవతిగా కనిపించనున్న కీర్తి సురేశ్
కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో .. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ గర్భవతిగా కనిపించనుండటం మరో విశేషం. కథ అంతా కూడా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఈ తరహా పాత్రలు చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయంటూ కీర్తి సురేశ్ చెప్పడం, ఆమె అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.