అందుకే క్రికెట్‌కు వీడ్కోలు పలికాను: యువరాజ్ సింగ్
- యోయో టెస్ట్ లో పాస్ కాలేనని భావించాను
- బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉంటే నా పరిస్థితి వేరుగా ఉండేది
- క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటి?
టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలోనే యోయో టెస్టును ప్రారంభించడాన్ని యువీ పరోక్షంగా విమర్శించాడు. క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటని నిలదీశాడు. కాగా, కేన్సర్ ను జయించి క్రికెట్‌లోకి మళ్లీ వచ్చాక ఆయన యోయో టెస్ట్ పాస్ కాలేదంటూ ఆయనను పలుసార్లు జట్టులోకి తీసుకోలేదు. ఇప్పటికే యోయో టెస్ట్‌పై యువీ పలుసార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.