మత్తు పదార్థాల విక్రయాలకు వసతి గృహాలే అడ్డా
- గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు విక్రయం
- నిఘా పెట్టిన పోలీసులు
- గంజాయితోపాటు వ్యక్తి అరెస్టు
వేగంగా డబ్బు సంపాదించేందుకు అతని దృష్టి మత్తు పదార్థాల విక్రయంపై పడింది. దీంతో హాస్టల్స్‌ను తన అడ్డాగా మార్చుకున్నాడు.విద్యార్థులతో పరిచయాలు పెంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాన్ని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చాడు.
దీనిపై కచ్చితమైన సమాచారం అందడంతో నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్న అమీర్‌పేటలోని సారథీ స్టూడియోస్ సమీపంలో అరవింద్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే కేజీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరవింద్‌కు మంగళహాట్‌కు చెందిన కిషోర్‌సింగ్ అనే వ్యక్తి గంజాయి సరఫరా చేస్తుంటాడని తేలడంతో అతని కోసం గాలిస్తున్నారు.