మానస బ్యారక్‌లో శశికుమార్.. గడ్డి తొలగింపు పనిని అప్పగించిన జైలు అధికారులు
- యూటీ నంబరు 1084 నంబరు కేటాయింపు
- వైద్య పరీక్ష అనంతరం పని అప్పగింత
- నెల రోజులపాటు బెయిలు లభించే అవకాశం లేనట్టే
మరోవైపు, శశికుమార్‌తోపాటు అరెస్ట్ అయిన కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఎక్కడున్నాడన్న విషయం మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. అతడిని కూడా చర్లపల్లి జైలుకే పంపించామని పోలీసులు చెబుతున్నా.. అతడు తమ వద్ద లేడని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో బాల్‌రెడ్డి ఎక్కడున్నాడన్న విషయం చర్చనీయాంశంగా మారింది.