రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరగవా మరి?: బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

  • కొత్త  రోడ్లు నిర్మించబోం
  • రోడ్లు గతుకులుగా వుంటే ప్రమాదాలు తగ్గుతాయి
  • బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ కొత్త థియరీ
అసోం బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో రోడ్ల ప్రమాదాలకు కారణం రహదారులు బాగుండడమేనని అన్నారు. అసోంలో రోడ్ల దుస్థితిపై అక్కడి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, కొత్త రోడ్లను ఎప్పుడు నిర్మిస్తారన్న ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం విని విలేకరులు విస్తుపోయారు. రోడ్లను నిర్మించే ప్రసక్తే లేదని, రోడ్లు బాగుంటే ప్రమాదాలు జరుగుతాయని, గతుకుల రోడ్ల వల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఆయన చేసిన వ్యాఖ్యలతో విలేకరులు షాక్‌కు గురయ్యారట.

ఎంపీ అక్కడితో ఆగిపోలేదు. రోడ్లు గతుకులతో నిండి సరిగా లేకపోతే యువత తమ వాహనాలను నెమ్మదిగా నడుపుతారని, దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని వివరణ కూడా ఇచ్చారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన మంచి రోడ్ల వల్ల ప్రమాదాలు బాగా పెరిగాయని పల్లబ్ లోచన్ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
BJP
assam
pallab lochan das
roads
Road Accident

More Telugu News