లక్ష్మణ్ నివాసంలో కీలక భేటీ...హాజరైన కోదండరాం, అశ్వత్థామరెడ్డి

  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చర్చనీయాంశం
  • భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
  • మంత్రి మండలి భేటీ అంశం ప్రస్తావన
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నెలరోజులకు సమీపిస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘం నాయకులు మొండిగా వ్యవహరిస్తుండడంతో సమ్మె పరిస్థితిపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు కార్మికుల్లోనూ ఆందోళన కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు కీలక నేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ స్వగృహంలో జరిగిన భేటీకి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రి మండలి సమావేశంలో ఆర్టీసీ అంశంపై జరిగిన చర్చ, సమ్మె భవిష్యత్తు కార్యాచరణ, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
Go Back to Shorts
BJP laxman
TJC kodandaram
TSRTC JAC
aswathamareddy

More Telugu News