జగన్ ను జైల్లో వేయించే ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నారుగా విజయసాయిరెడ్డిగారూ?: బుద్ధా వెంకన్న

  • ఢిల్లీలో మీరు తిప్పిన చక్రం వెనకున్న రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయాం
  • 16 ఏళ్ల శిక్షలో 16 నెలలు పోతే ఎంత?
  • ట్విట్టర్ లో బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'విజయసాయిరెడ్డిగారూ, ఇన్నాళ్లు మీరు ఢిల్లీలో తిప్పిన చక్రం వెనకున్న రహస్యాన్ని ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయామంటూ' వ్యాఖ్యానించారు.

'మీ వాడిని లోపల వేయించి సీఎం కుర్చీని కొట్టేయాలనే ప్లాన్ ను పక్కాగా అమలు చేస్తున్నారుగా' అంటూ ట్వీట్ చేశారు. 16 సంవత్సరాల శిక్షలో 16 నెలలు పోతే ఎంత విజయసాయిరెడ్డిగారూ... లెక్కల మాస్టారు కాబట్టి మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. దీనికి తోడు సీబీఐ కోర్టు నుంచి విజయసాయి బయటకు వస్తున్న వీడియోను అప్ లోడ్ చేశారు.
Go Back to Shorts
Jagan
Vijayasai Reddy
YSRCP
Budda Venkanna
Telugudesam

More Telugu News