భార్య దంతాలు సరిగ్గా లేవట.. తలాక్‌ చెప్పి వెళ్లిపోయిన హైదరాబాదీ!

  • మీడియాకు తెలిపిన రుక్సానా బేగం
  • దంతాలు సరిగ్గా లేవని భర్త వేధింపులు
  • తనకు న్యాయం చేయాలని డిమాండ్
ముస్లిం మహిళల పట్ల శాపంగా మారిన ట్రిపుల్ తలాక్ ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ పద్ధతికి అడ్డుకట్ట మాత్రం పడట్లేదు. విచిత్ర కారణాలను తెలుపుతూ కొందరు ట్రిపుల్ తలాక్ చెబుతూనే వున్నారు. అదే కోవలో తన భార్యకు దంతాలు సరిగా లేవంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయాడు.  
 
 తనకు దంతాలు సరిగ్గా లేవంటూ తన భర్త కొంత కాలంగా తనను వేధిస్తున్నాడని, ఇప్పుడు ట్రిపుల్ తలాక్ చెప్పి వెళ్లిపోయాడని బాధిత మహిళా రుక్సానా బేగం మీడియా వద్ద వాపోయింది. తనను ఇక కలవద్దని, తమ మధ్య బంధం తెగిపోయిందని అంటున్నాడని తెలిపింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్‌ చెప్పే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
Go Back to Shorts
triple talaq
Hyderabad
Telangana

More Telugu News