మా చీఫ్ చనిపోయాడు.. ధ్రువీకరించిన ఐసిస్: అమెరికాపై ప్రతీకారం తప్పదని హెచ్చరిక
- ఆడియో టేప్‌ను విడుదల చేసిన ఐసిస్
- కొత్త చీఫ్‌గా ఇబ్రహీం అల్ హషిమి అల్ ఖురేషి
- అమెరికా సైన్యం రహస్య ఆపరేషన్‌లో బగ్దాదీ హతం
వీరిద్దరి చావుకు కారణమైన అమెరికాపై ప్రతీకారం తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాగా, సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో ఆదివారం అమెరికా సైన్యం చేపట్టిన రహస్య ఆపరేషన్ సందర్భంగా బగ్దాదీ మరణించాడు. అమెరికా దళాలు చుట్టుముట్టడంతో వారికి సజీవంగా దొరకడం ఇష్టం లేని బగ్దాదీ, అతడి భార్య ఒంటికి పేలుడు పదార్థాలు అమర్చుకుని పేల్చేసుకున్నారు.