Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంటల్లోకి దూకి ప్రాణాలు కాపాడేవాడే నిజమైన హీరో: షారుఖ్ ఫై సల్మాన్ ప్రశంసలు

  • అమితాబ్ ఇంటి వద్ద దీపావళి వేడుకల సందర్భంగా ప్రమాదం
  • అగ్ని ప్రమాదం నుంచి ఐశ్వర్యారాయ్ మేనేజర్ ని కాపాడిన షారుఖ్
  • రియల్ హీరో అంటూ షారుఖ్ పై ప్రశంసలు
దీపావళి సందర్భంగా అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద జరిగిన వేడుకల సందర్భంగా ఐశ్వర్యారాయ్ మేనేజర్ అర్చన లెహంగాకు నిప్పంటుకున్న సంగతి తెలిసిందే. దాన్ని చూసి అందరూ షాక్ కు గురయ్యారు. షారుఖ్ ఖాన్ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెకు అంటుకున్న మంటలను తన జాకెట్ తో ఆర్పేసి ఆమెను కాపాడారు. ఈ నేపథ్యంలో, షారుఖ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రియల్ హీరో అంటూ ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు.

ఈ సందర్భంగా షారుఖ్ పై సల్మాన్ ఖాన్ కూడా ప్రశంసలు కురిపించారు. షారుఖ్ నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' చిత్రంలోని ఒక సన్నివేశాన్ని పోస్ట్ చేస్తూ... మంటల్లోకి దూకి ప్రాణాలను కాపాడేవాడే నిజమైన హీరో అంటూ ట్వీట్ చేశాడు.
Shahrukh Khan
Salman Khan
Bollywood

More Telugu News