యాక్షన్ డోస్ తగ్గించేసిన బోయపాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ డోస్ తగ్గించేసిన బోయపాటి

  •  బాలకృష్ణతో బోయపాటి సినిమా 
  • బడ్జెట్ నియంత్రణపై దృష్టి 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి
బోయపాటి సినిమా అనగానే సహజంగానే యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. అయితే తన తాజా చిత్రంలో ఆయన యాక్షన్ పాళ్లను తగ్గించేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమా చేశాడు. ఆ సినిమాలోని మితిమీరిన యాక్షన్ ఆయనను విమర్శలపాలు చేసింది. ఆ సినిమా పరాజయంపాలు కావడంతో ఆ విమర్శలు మరింత బలాన్ని పుంజుకున్నాయి.

దాంతో బోయపాటికి తరువాత సినిమా చేయడానికి గ్యాప్ వచ్చేసింది. ఇదంతా దృష్టిలో పెట్టుకున్న బోయపాటి, బాలకృష్ణ హీరోగా చేయనున్న సినిమాలో యాక్షన్ పాళ్లు హద్దులు దాటకుండా చూసుకుంటున్నాడట. అలాగే బడ్జెట్ నియంత్రణ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా సమాచారం. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్న ఈ సినిమా, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Balakrishna
Boyapati Sreenu

More Telugu News