దటీజ్ అక్షయ్ కుమార్.. 25 బాధిత కుటుంబాలకు కోటి రూపాయల సాయం!
Add ap7am to your home Screen

దటీజ్ అక్షయ్ కుమార్.. 25 బాధిత కుటుంబాలకు కోటి రూపాయల సాయం!

  • బీహార్‌లో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన 25 కుటుంబాలు
  • ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున కోటి సాయం
  • ఆర్థిక సాయంపై నేరుగా స్పందించని యాక్షన్ హీరో
ఆపన్నులను ఆదుకోవడంలో ముందుండే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. భారీ వర్షాల కారణంగా బీహార్‌లో నష్టపోయిన 25 బాధిత కుటుంబాల కోసం భారీ ఆర్థిక సాయం ప్రకటించాడు. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ఇచ్చినట్టు తెలిసింది. అయితే, అక్షయ్ ఈ విషయాన్ని నేరుగా వెల్లడించలేదు.

బాధితులకు సాయం అందించడం అక్షయ్‌కు ఇది కొత్తకాదు. ఎక్కడ ఏ ఘటన జరిగినా తొలుత స్పందించేది అతడే. ఈ ఏడాది ఆగస్టులో అసోంను వరదలు అతలాకుతలం చేశాయి. దీంతో స్పందించిన అక్షయ్ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు ఇచ్చాడు. అలాగే, వరద ముంపునకు గురైన కజిరంగ్ పార్క్ నుంచి వన్యప్రాణులన్ని కాపాడేందుకు మరో కోటి రూపాయలు అందించాడు. కాగా, తాజాగా విడుదలైన అక్షయ్ కుమార్ సినిమా ‘హౌస్‌ఫుల్4’ సినిమా బాక్సాఫీసును దున్నేస్తోంది. వసూళ్లలో దూసుకుపోతోంది.
akshay kumar
Bollywood
bihar
flood

More Telugu News