హాలీవుడ్ నవ్వుల రేడు జాన్ విథర్‌స్పూన్ కన్నుమూత

  • లాస్ఏంజెలెస్‌లో కన్నుమూసిన విథర్‌స్పూన్‌
  • ఫ్రైడే చిత్రంలో ఐస్‌క్యూబ్‌కు తండ్రిగా గుర్తుండిపోయే పాత్ర
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్న ఐస్‌క్యూబ్
హాలీవుడ్ నవ్వుల రేడు జాన్ విథర్‌స్పూన్ (77) కన్నుమూశాడు. లాస్ఏంజెలెస్‌లో ఆయన మరణించినట్టు మేనేజర్ అలెక్స్ గుడ్‌మన్ తెలిపారు. ‘ఫ్రైడే’ చిత్రంలో ఐస్‌క్యూబ్ తండ్రిగా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించిన విథర్‌స్పూన్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

ఇప్పటివరకు ఫ్రైడే పేరుతో తెరకెక్కిన మూడు చిత్రాల్లోనూ విథర్‌స్పూన్ నటించడం విశేషం. ఎన్నో గుర్తుండిపోయే చిత్రాల్లో విథర్‌స్పూన్ నటించినప్పటికీ హాస్యప్రియులకు మాత్రం ఆయన ఐస్‌క్యూబ్ తండ్రిగానే పరిచయం. విథర్‌స్పూన్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఐస్‌క్యూబ్ ట్వీట్ చేశాడు. విథర్‌స్పూన్‌కు భార్య ఏంజెలా, కుమారులు జేడీ, అలెగ్జాండర్ ఉన్నారు.
Go Back to Shorts
witherspoon
hollywood
comedian
dead

More Telugu News