ఊరికో ఇసుకాసురుడు...అంతా వైసీపీ నాయకులే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- చావు బాజా మోగిస్తూ వారోత్సవాలకు పిలుపా
- ఆరుగురు కూలీల ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమే
- ముందు ఇసుకాసురుల భరతం పట్టాలని డిమాండ్
ఇసుక కొరత కారణంగా ఆరుగురు కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, దానిపై మాట్లాడకుండా వారోత్సవాలు నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. చావు బాజా మోగించాక వారోత్సవాలు ఏమిటని ఎద్దేవా చేశారు. తెలంగాణలో లేని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పనులు కోల్పోయిన కార్మికులకు పరిహారం చెల్లించడంతోపాటు కార్మిక సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు.