అదేమీ హిందూ, ముస్లిం గొడవ కాదు... నటుడి 'దీపావళి' పోస్ట్ పై ముంబై పోలీసులు!
- పండగను అడ్డుకున్నారని విశ్వభాను పోస్ట్
- వైరల్ కావడంతో విచారణ జరిపిన పోలీసులు
- రెండు కుటుంబాల మధ్య రాజీ
దీనిపై విచారణ జరిపిన మల్వానీ పోలీసు స్టేషన్ అధికారి జగదేవ్ కలపాడ్ మీడియాకు వివరాలు అందించారు. ఇదేమీ హిందూ - ముస్లిం గొడవ కాదన్నారు. విశ్వభాను అలంకరించిన లైట్ల కారణంగా ఓ పిల్లాడికి షాక్ తగిలిందని, లైట్లు ఎత్తులో పెట్టాలని కొందరు కోరడంతోనే ఘర్షణ జరిగిందని అన్నారు. అదే ప్రాంతంలో ఎంతో మంది హిందువులు ఉన్నారని, వారంతా ఏ ఇబ్బందీ లేకుండా దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారని చెప్పారు. రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చామని, ప్రస్తుతం వివాదమేమీ లేదని స్పష్టం చేశారు.