షియోమీ నుంచి సంచలన ఫోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షియోమీ నుంచి సంచలన ఫోన్

  • భారీ సామర్థ్యమున్న కెమెరా ఫోన్ గా రికార్డు 
  •  త్వరలో మార్కెట్లోకి రానున్న‘ఎంఐ నోట్ 10’
  • టీజర్ ను విడుదల చేసిన కంపెనీ
ప్రపంచలోనే తొలిసారిగా 108 మెగాపిక్సల్ కెమెరా సామర్థ్యం తో కూడిన స్మార్ట్ ఫోన్ ను షియోమీ లాంచ్ చేయడానికి సన్నద్ధమయింది. ‘ఎంఐ నోట్ 10’ పేర మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ ను కంపెనీ విడుదల చేసింది. 108 మెగా పిక్సల్ సామర్థ్యంతో ఒక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. ఈ ఘనత తమకే దక్కనుందని సదరు కంపెనీ తెలుపుతోంది. అయితే, ఫోన్ విడుదల తేదీని కంపెనీ టీజర్లో ప్రకటించలేదు.  

ఫోన్ వెనక 108 మెగాపిక్సల్ తో కూడిన పెంటా కెమెరా యూనిట్ ఉంటుంది. ఇందులో 108 మెగాపిక్సల్ కెమెరా, 117 డిగ్రీలతో కూడిన 20 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరా, ఒక టెలిఫొటో లెన్స్, మాక్రో కెమెరా, 12 ఎంపీ పోర్ట్ రైట్ షూటర్ ఉన్నాయి.  టెలిఫొటో లెన్స్ కు 10 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 50 ఎక్స్ డిజిటల్ జూమ్ చేసే సామర్థ్యం ఉంది.ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సల్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
Mi
China
XIAOMI

More Telugu News