కీర్తి సురేశ్ కొత్త చిత్రం టైటిల్ ఇదేనట
- కీర్తి సురేశ్ చేతిలో మూడు సినిమాలు
- అన్నీ నాయిక ప్రాధాన్యత కలిగిన కథలే
- నాగేశ్ దర్శకత్వంలో రైఫిల్ షూటర్ గా కీర్తి సురేశ్
నరేంద్రనాథ్ దర్శకత్వంలో 'మిస్ ఇండియా' చేస్తున్న ఆమె, నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్ గా కనిపించనుంది. ఈ సినిమాకి 'గుడ్ లక్ సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. కీర్తి సురేశ్ కి కోచ్ పాత్రను జగపతిబాబు పోషిస్తుండగా, మరో ముఖ్యమైన పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నాడు. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలో చివరి షెడ్యూల్ కి వెళ్లనుంది.