దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారంలో పొరబాటు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారంలో పొరబాటు

  • హర్యానాలో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం
  • ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం
  • భారత్ కు ఉప ముఖ్యమంత్రిగా ఉంటానంటూ దుష్యంత్ చౌతాలా ప్రమాణం
హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ, జననాయక్ జనతాపార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయగా, ఉపముఖ్యమంత్రిగా జన నాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ప్రమాణస్వీకారం చేశారు.  దుష్యంత్ ప్రమాణస్వీకారం చేస్తున్నపుడు హర్యానా రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అనడానికి బదులు, 'భారత్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి' అని తప్పుగా అన్నారు. దాంతో గవర్నర్ మరోసారి ఆయన చేత ప్రమాణం చేయించారు.  
Dushyant
Haryana

More Telugu News