దేశ రాజధానిలో దీపావళి నాడు అగ్ని ప్రమాదాలు
- ప్రాణ నష్టం జరగలేదు
- భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
- రాత్రి 10 గంటల వరకే బాణసంచా కాల్చాలన్న నిబంధన ఉల్లంఘన
అగ్ని ప్రమాదాలు జరిగాయంటూ నిన్న అర్ధరాత్రి వరకు ఫైర్ సర్వీస్ విభాగానికి 245 కాల్స్ రాగా ఈరోజు ఉదయం 10గంటల వరకు మరో 96 కాల్స్ వచ్చాయి. అయితే, ప్రమాదాల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు తెలిపారు. రాత్రి 10గంటల వరకే బాణసంచా కాల్చాలని నిబంధనలు పెట్టినప్పటికి.. దీన్ని ఎవరూ పాటించడంలేదని, అర్ధరాత్రి వరకు కాలుస్తూనే వున్నారని అధికారులు చెబుతున్నారు.