కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణం: కోదండరామ్
- ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించింది
- ప్రభుత్వం మాత్రం వారితో ఖైదీల తరహాలో వ్యవహరిస్తోంది
- ప్రభుత్వ తీరు వల్ల చర్చలకు అవకాశం లేకుండా పోతోంది
రాజ్యాంగబద్ధంగా కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించిందని... కానీ, ప్రభుత్వం మాత్రం యూనియన్ నేతలతో ఖైదీల తరహాలో వ్యవహరించిందని విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల చర్చలు మళ్లీ జరిగేందుకు అవకాశం లేకుండా పోతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే సకలజనుల సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.