Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాణిశ్రీ కెరియర్ ను మలుపుతిప్పిన 'మరపురాని కథ'

  • వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి 
  • బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన వాణిశ్రీ 
  •  ముందుగా హీరోయిన్ గా చేసింది కన్నడలోనే  
రచయిత .. సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ప్రముఖ నటి వాణిశ్రీ గురించి ప్రస్తావించారు. "వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. ఆమె కెరియర్లోని ముఖ్యమైన మలుపులను నేను దగ్గరగా చూశాను. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన వాణిశ్రీ గారిని, ఆమె తల్లిగారు ఎన్నో కష్టాలుపడి ప్రయోజాకురాలిని చేశారు.

వాణిశ్రీగారు ఒక వైపున కన్నడలో కథానాయికగా చేస్తూ, మరో వైపున తెలుగులో చిన్న చిన్న పాత్రలను చేశారు. 'కన్నడలో నేను హీరోయిన్ .. తెలుగులో చిన్న పాత్రలను ఎందుకు చేయాలి?' అని ఆమె అనుకోలేదు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ, వచ్చిన పాత్రలను చేస్తూ వెళ్లారు. అలాంటి సమయంలోనే తమిళంలో సావిత్రిగారు చేసిన ఒక సినిమాను తెలుగులో 'మరపురానికథ' పేరుతో నిర్మించారు. ఆ సినిమాలో నాయికగా వాణిశ్రీగారిని తీసుకున్నారు. అలా ఆమె కెరియర్లో గొప్ప మలుపు ఈ సినిమాతో మొదలైంది" అని చెప్పుకొచ్చారు.
Vanisri

More Telugu News