విలన్ గా బన్నీతో తలపడనున్న విజయ్ సేతుపతి?
- త్రివిక్రమ్ సినిమాను పూర్తిచేస్తున్న బన్నీ
- త్వరలో సుకుమార్ తో సెట్స్ పైకి
- తమిళంలోనూ రిలీజ్ చేయాలనే ఆలోచన
బన్నీ తదుపరి సినిమా సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా వుంటుందట. ఈ పాత్రకి గాను తమిళ హీరో విజయ్ సేతుపతిని తీసుకోనున్నట్టు సమాచారం. తమిళనాట విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అందువలన తమిళంలోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేసుకోవచ్చనే ఆలోచనలో వున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు.