ఆర్టీసీ కార్మికులను యుద్ధ ఖైదీల్లా చూశారు: కోదండరాం
- కోర్టు చేసిన సూచనలను పాటించాలి
- తప్పును కార్మిక సంఘాల మీద నెట్టాలని ప్రభుత్వం చూస్తోంది
- తెలంగాణ సర్కారు సరైన రీతిలో స్పందించాలి
కాగా, ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తమకు సమ్మె విరమించాలనే ఉందని అధికారులను చెప్పామని అన్నారు. నిన్న వారు అసలు చర్చలు జరపలేదని, ఈ రోజు పిలిచినా చర్చలకు వస్తామని చెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే యూనియన్లు ఉండరాదన్న సీఎం కేసీఆర్ కోరి కూడా నెరవేరుతుందని అన్నారు.