అమెరికా దాడిలో సిరియాలో 9 మంది ఉగ్రవాదులు మృతి
- సిరియా వాయవ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో అమెరికా సైన్యం దాడి
- బారిషా గ్రామంలో తొమ్మిది మంది మృతి
- ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులు ఉంటారు
- వివరించిన బ్రిటన్ సంస్థ
సిరియా వాయవ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో ఉన్న బారిషా గ్రామంలో హెలికాప్టర్ నుంచి సైనికులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారని పేర్కొంది. ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులు ఉంటారని వివరించింది. బారిషా శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఇల్లు, కారుపై సైనికులు ఈ దాడి చేశారని పేర్కొంది.
కాగా, అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో ఇదే ప్రాంతంలో ఐసిస్ అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైన్యం హతమార్చిందని కథనాలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన చేయలేదు.