Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలీవుడ్ కు షాక్... ఆన్ లైన్ లో 'బిగల్', 'ఖైదీ'!

  • హిట్ టాక్ ను తెచ్చుకున్న చిత్రాలు
  • శుక్రవారమే ఆన్ లైన్ లో విడుదల
  • దిగ్భ్రాంతికి గురైన చిత్ర వర్గాలు
రెండు రోజుల క్రితం దక్షిణాదిన విడుదలైన రెండు అతిపెద్ద చిత్రాలు, ఆన్ లైన్లో పైరసీ అయ్యాయి. తమిళ్ రాకర్స్ వీటిని పైరసీ చేయడం కలకలాన్ని రేపింది. విజయ్ హీరోగా నటించిన 'బిగిల్', కార్తి ప్రధాన పాత్రలో వచ్చిన 'ఖైదీ' చిత్రాల తమిళ, తెలుగు వర్షాన్ లు ఇప్పుడు ఆన్ లైన్ లో ఉన్నాయి. ఇది చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ రెండు చిత్రాలూ హిట్ టాక్ ను తెచ్చుకుని, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.

దాదాపు ఒకే సమయంలో ఈ రెండు చిత్రాలకూ పైరసీ దెబ్బ తగిలింది. 'బిగిల్' (తెలుగులో విజిల్) విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో కనిపించగా, శుక్రవారం రాత్రి 'ఖైదీ' ఆన్ లైన్ లో లీకైంది. ఈ చిత్రాలను ఆన్‌ లైన్‌ లో ప్రచారం చేయరాదని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, అవి భేఖాతరు అయ్యాయి. చిత్ర సీమలో డిజిటల్ యుగం ప్రవేశించిన తరువాత పైరసీని అరికట్టడం అసాధ్యమైపోయిందని అంటున్నారు విశ్లేషకులు.
Piracy
Bigil
Vijil
Khaidi
Online

More Telugu News