ఇసుక మాఫియాపై మీ సొంత పార్టీ ఎమ్మెల్యే లేఖ రాశాడట, ఓసారి చదువుకోండి విజయసాయి గారూ: బుద్ధా వెంకన్న

  • ఇసుక అంశంపై బుద్ధా వ్యాఖ్యలు
  • విజయసాయి అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శలు
  • కార్మికుల ఆత్మహత్య విషయం తెలియదా అంటూ నిలదీత 
టీడీపీ నేత బుద్ధా వెంకన్న రాష్ట్రంలో ఇసుక కొరత అంశంపై ఘాటుగా స్పందించారు. ఇసుక కొరత అంటూ పచ్చ పార్టీ, పచ్చ మీడియా హడావుడి చేస్తోందని విజయసాయిరెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ మీ సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి లేఖ రాశాడట, ఓసారి ఆ లేఖ చదువుకోండి అంటూ హితవు పలికారు.

"అసలు మీరు నోటికి అన్నమే తింటున్నారా? మీ పార్టీ నేతల ఇసుక అక్రమాల కారణంగా గుంటూరులో ఇద్దరు భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్య చేసుకున్నారు, కనీసం ఈ విషయమైన తెలుసా, లేదా? అయినా మీకెలా తెలుస్తుంది, మీరు బ్లాక్ చానెల్ తప్ప మరొకటి చూడరు కదా" అంటూ విమర్శించారు.
Go Back to Shorts
Budda Venkanna
Vijay Sai Reddy
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News