రానా కొత్త వ్యాపారం... క్రీడారంగంలో పెట్టుబడులు!
- ఐఎస్ఎల్ లో ప్రవేశించిన రానా
- హైదరాబాద్ ఎఫ్.సితో చేతులు కలిపిన భల్లాలదేవుడు
- ట్విట్టర్ లో వెల్లడించిన హైదరాబాద్ ఎఫ్.సి యాజమాన్యం
హైదరాబాద్ ఎఫ్.సి కుటుంబంలో రానా కూడా భాగం అయ్యాడని మేనేజ్ మెంట్ ఓ ట్వీట్ లో వెల్లడించింది. హైదరాబాద్ ఫుట్ బాల్ రంగానికి పునర్వైభవం వస్తుందని భావిస్తున్నామని, ఈ సందర్భంగా రానాకు హార్దిక స్వాగతం పలుకుతున్నామని హైదరాబాద్ ఎఫ్.సి యాజమాన్యం పేర్కొంది.