Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి కథాబలం ఉన్న చిత్రానికే వెంకీ మొగ్గు.... తెలుగులో 'అసురన్' రీమేక్

  • కలైపులి ఎస్ థాను, సురేశ్ బాబు నిర్మాతలుగా రీమేక్
  • తమిళంలో ఘనవిజయం సాధించిన 'అసురన్'
  • త్వరలో వెంకటేశ్ హీరోగా సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రం
వెట్రిమారన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన 'అసురన్' చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. దసరా సీజన్ లో విడుదలై నేటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సందడి చేస్తున్న ఈ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేశ్ రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ మామ చిత్రంలో నటిస్తున్న వెంకటేశ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గా మరోసారి కథా బలమున్న చిత్రాన్నే ఎంచుకున్నాడు. 'అసురన్'లో విలక్షణమైన కథ ఉండడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

'అసురన్' మూవీని తెలుగులో కలైపులి ఎస్ థాను, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. 'అసురన్' చిత్రాన్ని తమిళంలో కలైపులి ఎస్ థాను నిర్మించారు. కాగా, తెలుగు రీమేక్ లో వెంకీ సరసన నటించేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.
Asuran
Venkatesh
Dhanush
Tollywood

More Telugu News