'నకిలీ మెయిల్ ఐడీ' కేసులో రవిప్రకాశ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు
- కూకట్ పల్లి కోర్టులో పూచికత్తు సమర్పించాలని ఆదేశం
- ఐ ల్యాబ్ పేరుతో నకిలీ ఐడీ సృష్టించిన రవిప్రకాశ్
- నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు
ఐ ల్యాబ్స్ గ్రూప్ అధ్యక్షుడు టి.కృష్ణప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు. నకిలీ ఈ-మెయిల్ సృష్టించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టించేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఈ రోజు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు... కూకట్ పల్లి కోర్టులో పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది.